తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండో దశ కంటి వెలుగును విజయవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రెండో దశలో భాగంగా ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమవుతుందన్నారు. మూడు రాష్ట్రాల సీఎంల చేతుల మీదుగా ఖమ్మం జిల్లాలో రెండో దశ కంటివెలుగు కార్యక్రమంను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి అన్నారు.
మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కంటి వెలుగు అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో ఎవరూ కూడా కంటి సమస్యలతో బాధపడవద్దని ఆదేశించారని మంత్రి అన్నారు. ఇందుకు అనుగుణంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని రెండ దశ ప్రారంభిస్తున్నామని తెలిపారు.
జిల్లాలో జనవరి 18 నుంచి జూన్ 30 వరకు జరిగే రెండవ దశ కంటి వెలుగు ఖమ్మం జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 4గంటల వరకు సోమవారం నుంచి శుక్రవారం కంటి పరీక్షలు చేస్తారని చెప్పారు. సిద్దిపేట జిల్లాకు అదనంగా 35మంది వైద్యులను రిక్రూట్ చేశామని అన్నారు. ప్పటికే 10లక్షల కళ్ల అద్దాలు ప్రతి జిల్లాకు చేరుకున్నాయని వివరించారు.
ప్రపంచం లోనే సామూహిక కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణలో తప్పా దేశంలో ఎక్కడా లేదన్నారు. రెండో దశ కంటి వెలుగుకు రూ. 250కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. జిల్లాలో 45 వైద్య బృందాలు, మరో మూడు అదనపు బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుఖ్‌హుస్సేన్, యాదవ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఒడితెల సతీశ్, ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఎంహెచ్‌వో కాశీనాథ్ ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…