క్రీడలతో పోటీతత్వం పెరుగుతుంది: హరీశ్‌ రావు

186
minister harirshrao
- Advertisement -

క్రీడల‌వల్ల ఆత్మ స్థైర్యం,పోటీతత్వం పెరుగుతుందన్నారు మంత్రి హరీశ్‌ రావు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్‌కు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిధిగా హాజరయ్యారు హరీశ్‌ రావు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ రావు….క్రీడలు లేక పిల్లల్లో శారీరక పటుత్వం తగ్గిపోయిందని..సెల్ ఫోన్ల కు అలవాటు పడిపోయారన్నారు. చిన్న వయసులోనే ఊబకాయం, బీపీ, షుగర్లు వస్తున్నాయని ఇవి రాకుండా ఉండాలంటే‌‌ వ్యాయమం అవసరం అన్నారు.

హెల్త్ ఈజ్ వెల్త్ అని తెలిపిన హరీశ్‌…గేమ్స్ అంటే టైం వేస్ట్ అనుకుంటారు…పబ్ జీ, ఫెస్ బుక్ లాంటి‌వల్ల టైం వేస్ట్‌ అన్నారు. క్రీడల‌వల్ల ఓటమిని‌ స్వీకరించే తత్వం అలావాటవుతుంది…..పాస్‌ కాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్రీడాస్ఫూర్తి అలవాటు కాకపోవడమేనన్నారు. పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్లినట్లే గ్రౌండ్ కు‌ పిల్లల్ని తీసుకెళ్ల్ బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలి…సీఎం పేరుతో ఈ టోర్నమెంట్ నిర్వహించిన విష్షు జగతికి అభినందనలు చెప్పారు.

- Advertisement -