ఘట్‌కేసర్ ఫార్మసీ స్టూడెంట్ ఆత్మహత్య

22
ghatkesar

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఘట్‌కేసర్ ఫార్మసీ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. షుగర్ ట్యాబ్లెట్స్ మింగి బలవన్మరణానికి పాల్పడింది. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జయిన నాటి నుంచి అమ్మమ్మ ఇంట్లో ఉన్న ఆ యువతి ఇవాళ ఉదయం షుగర్ మాత్రలు మింగింది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు.. ఘట్‌కేసర్ హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది.

ఫిబ్రవరి రెండో వారంలో కాలేజీ నుంచి తిరిగొస్తుండగా ఆటో డ్రైవర్లు తనను కిడ్నాప్ చేశారంటూ ఫార్మసీ స్టూడెంట్ తన తల్లికి ఫోన్ చేసిన చెప్పిన సంగతి తెలిసిందే. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని యువతి తెలపగా పోలీసులు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆ మార్గంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. మూడు రోజులపాటు శ్రమించి.. ఆమె చెప్పిందంతా అబద్ధమేనని తేల్చారు.