పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు

61
tamilisai

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళి సై. ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షాలు ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేస్తూ లేఖ రాశారు.ఈ లేఖపై కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకోనుంది.

అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంతో బీజేపీ నాయకత్వంలోని విపక్షాలు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటుకు విముఖత ప్రదర్శించాయి. మొత్తం 33 సభ్యులన్న పుదుచ్చేరి అసెంబ్లీలో అధికార కాంగ్రెస్-డీఎంకే కూటమికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరుగురు రాజీనామా చేయడంతో సభ్యుల సంఖ్య 27కి పడిపోయింది. ఇక బలపరీక్షలో సీఎం నారాయణస్వామి ఓడిపోవడంతో తన పదవికి రాజీనామా చేశారు.