మల్లన్న సాగర్‌ తెలంగాణకే తలమానికం: హరీష్‌ రావు

55
harishrao
- Advertisement -

మల్లన్న సాగర్‌ తెలంగాణకే తలమానికం అన్నారు మంత్రి హరీష్ రావు. మల్లన్న సాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన హరీష్…కాళేశ్వంతో 13 జిల్లాలకు సాగు,తాగు నీరు అందనుందన్నారు. దేశంలో నదిలేని చోట ప్రాజెక్టు కట్టింది సీఎం కేసీఆరే అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన ప్రాజెక్టు ఆగలేదన్నారు. తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.

మల్లన్న సాగర్ ప్రారంభోత్సవంలో పాల్గొనడంతోనే తన జన్మ ధన్యమైందన్నారు. మల్లన్న సాగర్ వరప్రదాయని అన్నారు. జనగామ,ఆలేరుకు కూడా నీళ్లు వస్తాయన్నారు.

ఇక అంతకముందు కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ జలాశయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం స్విచ్ఛాన్ చేసిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌లోకి సీఎం కేసీఆర్ నీటిని విడుద‌ల చేశారు.

- Advertisement -