ఓటు మీది మాట నాది అని దుబ్బాక ప్రజలకు హామీ ఇచ్చారు మంత్రి హరీశ్ రావు. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత కు మద్దతుగా రాయపోల్ మండలం ఎల్కల్, వడ్డేపల్లి, రామసాగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు…ఓటు మీది… మాట నాది.. మూడు ఈ రోజులు మీరు కష్టపడంది.. ఆపై మూడేళ్లు మీ సేవ చేస్తానన్నారు. సీసాలు, పైసలు ఇచ్చేటోళ్లకు ఒట్లు.. ఓట్లు వేయొద్దు అన్నారు. మేము పైసలు, సీసాలు ఇచ్చే వాళ్లం కాదు.. పని చేసి ఓట్లు అడుగుతాం.. చేసే పనులు చెబుతాం..ఝూటా పార్టీలను నమ్మొద్దు అన్నారు.
నిజాం కాలంలో భూములున్న రైతుల నుంచి సర్కారీ రకం పేరిట శిస్తులు వసూలు చేసేవారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భూమి శిస్తూ, నీటి తీరువా పేరుతో వసూలు చేశారు.. ఒక్క టిఆర్ఎస్ మాత్రమే భూములున్న రైతులకు ఏటా 10 వేలు పట్టుబడి సాయం ఇస్తుందన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు రైతులకు పది రూపాయలు ఇచ్చారా ?కరోనా వస్తే కారేటు మీద 1500, 12కిలోల బియ్యం ఇచ్చామని.. కాంగ్రెస్, బిజేపీ వాళ్ళు పైసలిస్తాము, సిసలిస్తాము ఓట్లు వేయమంతున్నారు….ప్రజలు ఆలోచించాలన్నారు.