వారిని చెరువులో ముంచాలి: హరీశ్ రావు

100
harishrao
- Advertisement -

కాంగ్రెస్, బీజేపీ నేతలను సిద్దిపేట చెరువులో ముంచాలన్నారు మంత్రి హరీశ్ రావు. నంగునూర్ మండలం రాజగోపాల్ పేట గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…దేశంలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చింది కేవలం సీఎం కేసీఆర్ ఒక్కడేనని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఎవుసానికి గతంలో నీళ్లు లేక ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు నీళ్లు పుష్కలంగా ఉండటంతో కూలీలు దొరకడం లేదన్నారు. బిహార్ నుంచి కూలీలొచ్చి వరి నాట్లు వేస్తున్నారని తెలిపారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువులో నీళ్లు గుంజుకుపోయేవి. బోర్లు వేసి, మోటర్లు పెట్టి, ట్రాన్స్‌ఫార్మర్స్‌ పెట్టి చెరువులు నింపేవారమని నాటి రోజులను గుర్తు చేశారు. కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా.. సీఎం కేసీఆర్ దయతో నిండుగా ఉందన్నారు. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే బీడీ కార్మికులకు రూ.2,016 పింఛన్ ఇస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామాభివృద్ధికై దశల వారీగా కృషి చేస్తామన్నారు.

- Advertisement -