బండి క్షుద్రపూజలపై హరీశ్‌ ఫైర్

94
- Advertisement -

మునుగోడు ప్రజలకు ఏం చేస్తామో చెప్పలేని బీజేపీ నేతలు.. క్షుద్రపూజలు అని ఒకరు, అవినీతి అని చవకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు హరీశ్‌ రావు. మంత్ర తంత్రాలతో తామేమైనా అధికారంలోకి వచ్చామా? అని ప్రశ్నించారు. మతం పేరుతో అధికారంలోకి వచ్చేందుకు రాజకీయం చేసేది ఒక్క బీజేపీయే అన్నారు. అందుకే భూతవైద్యం కోర్సు నేర్చుకోవాలని యూపీలోని బీజేపీ ప్రభుత్వం కొత్త కోర్సును తీసుకొచ్చిందన్నారు. బీజేపీకి దమ్ముంటే చేసే ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. మోటర్లకు మీటర్లు పెడితే తప్పేంటన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు మునుగోడు ప్రజలకు ఏం చెప్తారని నిలదీశారు. ఇప్పటికే మునుగోడులో పంచేందుకు 200 బ్రెజ్జా కార్లు, 2000 మోటర్ సైకిళ్ళు బుక్ చేసినట్లు తెలిసిందని ఆరోపించారు.

ఇవ్వాళ మునుగోడు ఆత్మగౌరవ పరీక్ష అని చెప్పిన హరీష్‌రావు.. మునుగోడు ప్రజలు గెలవాలా? రాజగోపాల్ రెడ్డి ధనం గెలవాలా? అన్నది ముఖ్యమైందన్నారు. ఫ్లోరెడ్ సమస్యను తీర్చి, అన్ని వర్గాలకు పెన్షన్లు ఇస్తున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం అని గుర్తుచేశారు. దేశంలో ఒక్క వర్గం వారికైనా బీజేపీ మంచి పని చేసిందా? అని ప్రశ్నించారు.

- Advertisement -