రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలతో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ,10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో వైద్య,ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
అన్ని జిల్లాల వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై సమీక్షించనున్నారు.
Also Read:Project K:ప్రభాస్ లుక్ కాపీనా?
మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రిలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి.
Also Read:Project K:రైడర్స్ ప్రమోషన్స్