Project K:ప్రభాస్ లుక్ కాపీనా?

49
- Advertisement -

సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులని మరోసారి ఆకట్టుకుంది వైజయంతీ మూవీస్. ఈ చిత్ర భారీ తారాగణంలో కమల్ హాసన్ చేరికతో సంచలనం సృష్టించింది. తర్వాత శాన్ డియాగో కామిక్-కాన్‌లో పాల్గొనే మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. తాజాగా విడుదలైన దీపికా పదుకొణె ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అందరినీ సర్ప్రైజ్ చేసింది.

ప్రేక్షకులను కట్టిపడేసేలా వైజయంతీ మూవీస్ ఇప్పుడు ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ ని విడుదల చేసింది. సెపియా టోన్డ్ క్యాప్టివేటింగ్ ఇమేజ్‌లో ప్రభాస్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ఫ్యాన్స్‌కు సూపర్ కిక్ ఇచ్చింది.అయితే ఈ లుక్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఐరన్ మ్యాన్ లుక్‌ని కాపీ కొట్టారంటూ రెండు పోస్టర్లను ఒకేచోట వేసి దర్శకుడిని తూర్పారపడుతున్నారు. మరి దీనిపై చిత్రయూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Also Read:T Congress:నో ఎంట్రీ..కాంగ్రెస్ లో సీట్లు క్లోజ్!

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్ K’లో ఇండస్ట్రీ లోని బిగ్గెస్ట్ స్టార్స్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. ఈ భారీ తారాగణం కలయిక, నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకర్షించే అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని హామీ ఇస్తోంది.

Also Read:కీలక నేత వైసీపీకి గుడ్ బై?

- Advertisement -