పాటలతో ప్రజల్లో చైతన్యం తెచ్చిన సిరివెన్నెల..

67
harishrao

తన పాటలతో ప్రజల్లో చైతన్యం తెచ్చిన గొప్ప వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ ఫిల్మ్‌ చాంబర్‌లో సిరివెన్నల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి మంత్రి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌ రావు…సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సినీ పరిశ్రమకు, సాహిత్య రంగానికి తీరని లోటన్నారు. పండితులు, పామరులను సైతం మెప్పించిన గొప్ప వ్యక్తిత్వమని చెప్పారు. సినిమా పాటల్లో సిరివెన్నెలది ప్రత్యేక స్థానమన్నారు. అశ్లీలం, ద్వంద్వార్థాలు లేని పాటలు రాసిన గొప్ప రచయిత అని, సినిమా పాటల్లోనూ సాహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు.

Minister Harish Rao About Sirivennela Seetharamasastry |Harish Rao Pays Tribute to Sirivennela|GT TV