టీఆర్ఎస్వీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు..

75
harishrao
- Advertisement -

సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గం స్థాయి టి ఆర్ ఎస్ విద్యార్తి విభాగం ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. గొంతు పెద్దగా చేసుకొని ఒక అబద్దాన్ని వందసార్లు చెప్పడం , గ్లోబల్ ప్రచారం చేస్తూ అబద్ధాలను నిజమని నమ్మేలా భాజాపా ప్రచారం సాగిస్తుందన్నారు.- ఫేక్ వాట్సప్ యూనివర్సిటీ ల ద్వారా ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజలను భాజపా మభ్య పెట్టే ప్రయత్నం లబ్ది పొందే ప్రయత్నం చేస్తుందన్నారు. నీతి అయోగ్ కూడా రిపోర్ట్ ప్రకారం తెలంగాణ అనేక అంశాల్లో దేశంలోనే ముందుందన్నారు.

విద్యుత్ తలసరి వినియోగం లో తెలంగాణ దేశంలోనే నెం.1 అని…. తలసరి ఆదాయం లో దక్షిణ భారత దేశంలో తెలంగాణ నెం.1 అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే రాష్ట్రంలో దేశంలోనే టాప్ రాష్ట్రాల లో తెలంగాణ నెం.3 అన్నారు. సాక్షాత్తు pm ప్రాతినిధ్యం వహించే, యోగి పాలించే బిజేపి పాలిత ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం 28 వ స్థానం . దేశంలోనే ఆఖరు స్థానంలో ఉన్నాయన్నారు. ఇదే తెరాస , భాజాపా పనితీరు కు నిదర్శనం అన్నారు.

317 GO ను బండి సంజయ్ విమర్శించడం అంటే వారి బిజేపి పాలిత కేంద్ర ప్రభుత్వం ను తప్పు పట్టడమేనన్నారు. ప్రధాన మంత్రిని, రాష్ట్ర పతిని తప్పు పట్టడమే అవుతుందని నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడమేనని మండిపడ్డారు. 317 GO తో 85 శాతం ఉద్యోగులు సంతోషంగా ఉన్నారన్నారు. అందరూ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ కే వస్తా నంటే …ఆ జిల్లా ల ఉద్యోగుల కు నష్టం చేసినట్టు కాదా? అని ప్రశ్నించిన హరీష్… బండి సంజయ్ దీనికి నేరుగా సమాధానం చెప్పాలన్నారు.

- Advertisement -