- Advertisement -
రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా ముగిశాయి. సిద్దిపేట కోమటి చెరువు వద్ద సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి హరీశ్ రావు. ప్రకృతిని అమ్మాలా పూజించే పండుగ బతుకమ్మ.. ఈ పండుగను సంప్రదాయ బద్దంగా జరుపుకుంటున్నాం అన్నారు.
పువ్వులను పూజింజే సంస్కృతి ఒక్క తెలంగాణ లొనే ఉందని…సీఎం కేసీఆర్ ఆశీర్వాదం,మీ అందరి సహకారంతో సిద్దిపేటను అన్నిరకాలుగా అభువృద్ధి చేసుకున్నాం… విద్య,వైద్య రంగాల్లో గొప్ప అభివృద్ధి సాధించాం..సిద్దిపేట ను జిల్లా చేసుకున్నాం అన్నారు. అన్ని రంగాల్లో సిద్దిపేట అగ్రస్థానం లో ఉందని….
భగవంతుని ఆశీర్వాదం తో ప్రజలంతా ఆనందంగా ఉండాలి.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు. కోమటి చెరువు అందాలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని..ప్రజలందరికీ బతుకమ్మ,దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -