త్రాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూస్తాం: హరీష్

150
minister
- Advertisement -

సిద్ధిపేట జిల్లా, చిన్న కోడూరు మండలం మల్లారం గ్రామంలో వేకువ జామున కురిసిన భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న మల్లారం వాగు, గ్రామంలోని హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సివరేజి బోర్డ్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లో నీట మునిగిన పంప్ హౌజ్‌ను పరిశీలించారు మంత్రి హరీష్ రావు. సోమవారం వేకువ జామున మునుపెన్నడూ లేని విధంగా సిద్దిపేట జిల్లా లో 4 గంటల్లో 13 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది… కుండపోత వర్షం తో ఉధృతమైన వరద నీరు రావడంతో చిన్న కోడూరు మండలం మల్లారం గ్రామంలోని హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సివరేజి బోర్డ్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లోని 6.6 KV పంప్ హౌజ్ నీట మునిగిందన్నారు.

పంప్ హౌజ్ నీట మునకతో హైదారాబాద్ డ్రింకింగ్ వాటర్ తో పాటు సిద్దిపేట, జనగాం, భువనగిరి, మేడ్చల్ పరిధిలోని 1950 హబిటేషన్ లకు త్రాగునీటి సరఫరా కు అంతరాయం కలగనుందన్నారు. హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సివరేజి బోర్డ్ ఎండీ దాన కిషోర్ నేతృత్వంలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నాం అన్నారు. 1 నుంచి 2 రోజుల్లో తాత్కాలిక ప్రాతిపదికన రిస్టో రేషన్ చర్యలు చేపడతామని… 2 నుంచి 3 రోజుల్లో శాశ్వత ప్రాతిపదికన ప్రాతిపదికన రిస్టో రేషన్ చర్యలు చేపడతాం అన్నారు.

సీఎం శ్రీ కేసిఆర్ దూర దృష్టి తో రింగ్ మెయిన్ ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్నాం అన్నారు. పంప్ హౌజ్ నీట మునకతో మల్లారం ట్రీట్ మెంట్ ప్లాంట్ ద్వారా త్రాగునీటి సరఫరా లో ఎదురయ్యే తాత్కాలిక అడ్డంకులను అధిగమించేందుకు కృషిచేస్తున్నాం అన్నారు. హిమాయత్ సాగర్, గండి పేట, ఉస్మాన్ సాగర్, సింగూరు నుంచి హైదారాబాద్ కు త్రాగునీటి సరఫరా పెంచుతాం… భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపడుతాం అన్నారు.

- Advertisement -