10 కోట్లతో చెక్‌ డ్యాం పనులు: హరీశ్ రావు

233
harish
- Advertisement -

పెద్దవాగుపై ఖాతా గ్రామం వద్ద‌ దాదాపు రూ.10 కోట్ల రూపాయల వ్యయంతో చెక్‌డ్యాం, దర్గ‌పల్లి గ్రామంలో సిద్ధిపేట వాగుపై చెక్‌డ్యాం నిర్మాణ పనులు కొన‌సాగుతున్నాయన్నారు మంత్రి హరీశ్‌ రావు. నంగునూరు మండ‌లంలో కొన‌సాగుతున్న కాలువలు, చెక్‌డ్యాం నిర్మాణ ప‌నుల‌ను మంత్రి హ‌రీశ్ రావు ప‌రిశీలించారు.

ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏస్ఈ బస్వరాజ్, ఈఈ గోపాల కృష్ణ, డీఈ చంద్రశేఖర్, ఏఈ ఖాజాలతో కలిసి రంగనాయక సాగర్ జలాశయం ఆర్ఏంసీ కుడి కాలువ ద్వారా వచ్చే నీరు, వాటి నీటి లభ్యత‌పై, ఎల్డీ-10 పనుల పురోగతిపై చర్చించారు. వానాకాలం సీజన్ ప్రారంభంకానున్న నేప‌థ్యంలో ఈ ప‌నులను జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నంగునూరు మండలంలోని వాగు అవతలి గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

- Advertisement -