గౌరవెల్లి ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌కు గొప్ప వరమన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరయ్యారు.
ఈ నెల 15వ తేదీన తెలంగాణ భవన్ వేదికగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారని చెప్పారు హరీష్.ఇక అదేరోజు సాయంత్రం హుస్నాబాద్‌లో నిర్వహించే బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. హుస్నాబాద్ కార్యకర్తలపై నమ్మకంతో కేసీఆర్ తొలి ఎన్నికల సభ ఇక్కడ నిర్వహిస్తున్నారని తెలిపారు.
గౌరవెల్లి ప్రాజెక్టును హుస్నాబాద్‌కు సీఎం కేసీఆర్ ఇచ్చిన గొప్పవరం అని …తెలంగాణ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. వరి ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రం నంబర్ వన్ అయిందని వెల్లడించారు. తన పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ సభా స్థలి వేదికను పరిశీలించారు.
Also Read:జైల్లో చంద్రబాబు.. ప్లాన్ లో వైసీపీ?