దేశంలో అగ్రభాగాన తెలంగాణ పోలీస్‌: హరీశ్‌ రావు

565
harishrao
- Advertisement -

ఆరేండ్లలోనే తెలంగాణ పోలీసింగ్‌ జాతీయ స్థాయిలో అగ్రభాగాన నిలిచిందన్నారు మంత్రి హరీశ్‌ రావు. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్‌లో ఆధునిక హంగులతో నిర్మించిన మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ను హోం మంత్రి మహమూద్‌ అలీతో కలిసి ప్రారంభించారు హరీశ్‌ రావు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ రావు… అత్యాధునిక, సాంకేతిక సేవలను ఉపయోగించడంలో దేశానికే రాష్ట్రం రోల్‌ మోడల్‌గా నిలిచిందని తెలిపారు. ఇక్కడ అమలుచేస్తున్న పోలీస్‌ సేవలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కేంద్రమే చెప్పడం సీఎం కేసీఆర్‌ పనితీరుకు నిదర్శనమన్నారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయని ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయని తెలిపారు హరీశ్‌. పోలీస్‌ శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.

పోలీసుల మెరుగైన సేవల వల్లే హైదరాబాద్‌తోపాటు పలు స్టేషన్లకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ వచ్చిందని చెప్పారు. షీటీమ్స్‌, సీసీ కెమెరాలు, ఆన్‌లైన్ వ్యవస్థ, సాంకేతిక సేవలతో రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్, జెడ్పీ చైర్మన్‌ రోజా రాధాకృష్ణ శర్మ పాల్గొన్నారు

- Advertisement -