లీవ్ కోసం కానిస్టేబుల్ లేఖ..బదిలీ వేటు!

169
madhya pradesh
- Advertisement -

తన భార్య టార్చర్ భరించలేక లీవ్ కోసం ఏకంగా డీజీపీకి లేఖ రాశాడు ఓ కానిస్టేబుల్. అయితే ఆ లేఖను సోషల్ మీడియాలో ఉంచడం,వైరల్‌గా మారడంతో అతడిపై శాఖాపరమైన చర్యలను తీసుకుంది పోలీస్ శాఖ.

వివరాల్లోకి వెళ్తె..మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌కు చెందిన కానిస్టేబుల్ దిలీప్ కుమార్ తనకు ఐదు రోజుల సెలవు కావాలంటూ భోపాల్ డీఐజీ ఇర్షాద్ వలీకి లేఖ రాశారు. లేఖలో సార్ డిసెంబర్ 11న నా బావమరిది పెళ్లి. నేను తప్పకుండా వెళ్లాలి. లేదంటే నా భార్య పెట్టే టార్చర్ ను నేను తట్టుకోలేనంటూ పేర్కొన్నారు.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఆ లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అది వైరల్‌గా మారడంతో శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. దిలీప్‌ను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేస్తూ లీవ్ కోసం లెటర్ రాయడం తప్పుకాదు దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడం తప్పని అందుకే చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -