మీకు న‌చ్చితే నీతి.. న‌చ్చ‌క‌పోతే అవినీతి: హ‌రీశ్‌రావు ఫైర్‌

76
harish
- Advertisement -

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రిగింద‌ని మాట్లాడుతున్న కేంద్ర మంత్రుల‌పై మంత్రి మండిప‌డ్డారు. టీఆర్ఎస్ఎల్పీలో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. నిన్న కేంద్ర మంత్రి షెకావ‌త్‌ బాధ్య‌త‌ రాహిత్యంగా రాజ‌కీయాల కోసం విలువ‌ల‌ను తుంగ‌లో తొక్కుతూ.. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రిగింద‌ని మాట్లాడారు. ఆ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

సీఎం కేసీఆర్ ఈ మ‌ధ్య కాలంలో కేంద్ర ప్ర‌భుత్వ నిజ‌స్వ‌రూపాన్ని ఎండ‌గ‌డుతున్నారు. దాంతో బీజేపీ నేత‌ల‌కు క‌డుపు మండుతోంది. అంత‌కు ముందు మెచ్చుకున్న నోళ్ల‌తోనే పుచ్చిపోయిన మాట‌లు మాట్లాడుతున్నారు. కాళేశ్వ‌రానికి కితాబిచ్చిన వారే ఇప్పుడు మ‌త‌ల‌బు ఉందంటున్నారు. కేంద్ర మంత్రులు షెకావ‌త్‌, గ‌డ్క‌రీ, సీడ‌బ్ల్యూసీ చైర్మ‌న్ మ‌సూద్ హుస్సేన్ అంద‌రూ అభినందించారు.

పార్ల‌మెంట్ సాక్షిగా చెప్పిన నిజాల‌ను ఇప్పుడు అబ‌ద్ధాలుగా ప్ర‌చారం చేస్తున్నారు. వారిది నోరు అనుకోవాలా? మోరి అనుకోవాలా? అని ప్ర‌శ్నించారు. పూట‌కో మాట మాట్లాడుతూ.. అవ‌స‌రం ఉంటే ఓ తీరు.. లేక‌పోతే ఓ తీరు.. ప‌ద‌వుల కోసం ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడేమో అవినీతి జ‌రిగిందంటున్నారు.. అనుమ‌తులు, అప్పులు ఇచ్చింది మీరే క‌దా? డీపీఆర్ తో పాటు అన్ని విష‌యాల‌ను ప‌రిశీలించాకే అనుమ‌తులు ఇచ్చారు. అటవీ అనుమతులను డిసెంబర్‌ 22,2017 రోజున ఇచ్చారు. పర్యవరణ అనుమతులు 24నవంబర్‌ 2017 రోజున, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై చేసే ఖర్చులు కోసం కాస్ట్‌ భేనిఫిట్‌ రేషియో కింద అనుమతులు 1మే 2018 నాడు ఇచ్చారు. మీరు కేవలం రాజకీయ లబ్ధి కోసం దొంగ ప్రచారం చేస్తున్నారే తప్ప మరేం లేదన్నారు. మీ మాటలు నమ్మడానికి ఇక్కడ ఏవరూ సిద్దంగా లేరు. అన్ని అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వం టెక్నికల్‌ అనుమతులు కూడా 14జూన్‌ 2018 రోజున ఇచ్చింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అనుమతులు లేవని అనడం సిగ్గుచేటన్నారు. మీకు న‌చ్చితే నీతి.. న‌చ్చ‌క‌పోతే అవినీతి ఇది బీజేపీ తీరు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

రాష్ట్రం వచ్చిన తర్వాత సాగు విస్తీర్ణం 34,96,000 ఎకరాలు ఉండగా…అది 2020-2021నాటికి ఒక కోటి నాలుగు లక్షల ఎకరాల వరిసాగు విస్తీర్ణం పెరిగింది. ఇందులో కాళేశ్వరం నీళ్లు లేవంటారా. సూమారుగా గత యాసంగిలో 6 లక్షల టన్నుల ధాన్యం ఎలా పండిందో చేప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం. గత యాసంగి పంట కొనలేదు, కనీసం ఈ యాసంగీ పంటైన కొనండి. మీరు నీళ్లు ఇవ్వరూ, పండించిన ధాన్యం కొనరు. రాష్ట్రానికి రావల్సిన నిధులు ఇవ్వరు. పంట పండితే కొనే బాధ్యత మీదే కదా…. ఎఫ్‌సీఐ ప్రకారం దేశంలో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్రంది కాదా. ఏట్టి పరిస్థితులల్లో బాయిలకాడ మోటర్లకు మీటర్లు పెట్టం మా ప్రాణం పోయిన ఏ ఒక్క రైతు బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టనియమన్నారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో సీఎం కేసీఆర్ అద్భుతంగా ప‌ని చేశార‌ని మోదీ పార్ల‌మెంట్‌లో మెచ్చుకున్నారు. ఈ ప్రాజెక్టుకు తానే అనుమ‌తి ఇచ్చాను. తెలంగాణ‌కు గ్రోత్ ఇంజిన్ అయింద‌ని.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ‌డ్క‌రీ చెప్పారు. దేశంలో ఏప్రాజెక్టు క‌ట్టినా కూడా దానికి సీడ‌బ్ల్యూసీ అనుమ‌తి త‌ప్పనిస‌రి. సీడ‌బ్ల్యూసీ చైర్మ‌న్ మ‌సూద్ హుస్సేన్ కూడా కాళేశ్వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించి మెచ్చుకున్నార‌ని ఈ సందర్భంగా హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

- Advertisement -