సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ప్రశంసలు గుప్పించారు మంత్రి హరీష్ రావు. తన స్వంత నిధులతోగ్రామాలకు ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లను పంపిణీ చేయడం తెలంగాణలోనే తొలిసారని అన్నారు.
ప్రతి గ్రామంలో ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్ ,త్రాగు నీరు ,24 గంటల కరెంట్ మాలిక సదుపాయాలు పూర్తిగా ఉండాలని ముఖ్యమంత్రి కోరిక అని… తెలంగాణ వివిధ రాష్టలకు ఆదర్శం అన్నారు.వచ్చే నెల రోజుల్లో సంగారెడ్డి జిల్లాలో వైకుంఠ ధామాలు రైతు వేదికలు పూర్తి స్థాయిలో నిర్మిస్తాం అన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 100 పడకల కరోనా ఆస్పత్రిని ప్రారంభిస్తున్నామని..కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి భయపడే అవసరం లేదు అన్నారు.భయం లేకుండా పరీక్షలు చేయించుకోవాలి కరోన భారిన పడ్డ వారిని చులకనగా చూడవద్దు అన్నారు.పఠాన్ చేరు నియోజకవర్గంలో మొత్తం 55 గ్రామ పంచాయతీ లకు గానూ ఇవాళ 7 గ్రామ పంచాయితీ లకు ట్రాక్టర్ పంపిణీ చేయడం జరిగిందన్నారు.