వంద శాతం టెట్ ఫలితాలు రావాలన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట – పొన్నాల టెట్ శిక్షణ కేంద్రంలో టెట్ ఉద్యోగార్థులకు పుస్తకాలు మెటీరియల్స్ పంపిణీ చేశారు. చరిత్ర తిరగ రాసిన రాష్ట్రం తెలంగాణ అన్నారు.
టెట్ తర్వాత గ్రూప్స్ 2, 3, 4 తో పాటు డీఏస్సీ అభ్యర్థులకు శిక్షణ తరగతుల నిర్వహిస్తామన్నారు. అన్ని పోటీ పరీక్షలకు వారధిగా నిరుద్యోగ యువతకు నిరంతర శిక్షణ ఇస్తామన్నారు. వంద శాతం టెట్ కోచింగ్ ఫలితాలు రావాలి, టెట్ తర్వాత గ్రూప్స్ 2, 3, 4 తో పాటు డీఏస్సీ శిక్షణ తరగతులు నిర్వహిస్తాము, అన్నీ పోటీ పరీక్షలకు వారధిగా నిరుద్యోగ యువతకు నిరంతరం శిక్షణ-తర్ఫీదు ఉంటుందన్నారు.
ఒక్క అడుగు బయటకు వేసిన వారిలో సీరియస్ నెస్ తో పాటు వారికి సమాజం పట్ల అవగహన కలిగి ఉంటారు. సమయం చాలా విలువైంది. పోయిన కాలం తిరిగి రాదు, ప్రతీ ఒక్కరూ కాలాన్ని, ఈ టెట్ శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.