గ్రీన్‌ ఛాలెంజ్‌: మహా యజ్ఞంలో మేము సైతం..

12

రాజ్యసభ సభ్యులు వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ వేడుకేదైనా వేదికేదైన అన్ని సందర్భాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకోవాలనే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పిలుపు మేరకు తమ పెళ్ళిరోజు సందర్భంగా నిజామాబాద్ లోని ఫాం హౌజ్‌లో మందారం మరియు అంజీర్‌ మొక్కలను నాటారు సత్య మురళి దంపతులు.. మొక్కలు నాటే ఈ మహా యజ్ఞంలో “మేము సైతం” భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉంది అని.. భవిష్యత్తు తరాలకు ప్రకృతి సమతుల్యం ఈ ఉద్యమం ద్వారా అందివస్తాయని ఆశాభావం వ్యక్తమవుతున్నదన్నారు. అందరం అందరికోసం హరిత తెలంగాణను సృష్టిద్దాం…గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొందామని కోరారు.