కొత్తరేషన్ కార్డులు పంపిణీచేసిన మంత్రి హరీష్‌ రావు..

135
harish
- Advertisement -

గజ్వేల్ లోని మహతీ ఆడిటోరియంలో కొత్త రేషన్ కార్డులు మరియు కళ్యాణ‌ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తెలంగాణలో పేదలకు లిబరల్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం అని తెలిపారు. 87 లక్షల 41 వేల మందికి రేషన్ కార్డులు గతంలో అందజేశాం…కొత్తగా 3 లక్షల 9 వేల 83 మందికి రేషన్ కార్డులు అందజేస్తున్నాం అన్నారు.

ప్రస్తుతం కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో అన్నిరకాల కార్డులు దాదాపు 90.50 లక్షలు, లబ్దీదారులు 2 కోట్ల 88 లక్షల మంది ఉన్నారు…రాష్ట్రంలో 90.5 శాతం జనాభాకు రేషన్ బియ్యం అందిస్తున్నాం అన్నారు. దేశంలో 90.5 శాతం జనాభాకు రేషన్ బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని వెల్లడించారు. కార్డు పై 20 కిలోల సీలింగ్ ఎత్తేశాం….యూనిట్ కు 4 కేజీ ల నుంచి 6 కేజీ లకు బియ్యంను పెంచాం అన్నారు. రేషన్ పై ప్రతి ఏటా ప్రభుత్వం 2766 కోట్లు, ప్రతి నెలా 232 కోట్లు ఖర్చు చేస్తుంది…70 ఎండ్లలో చేయని పనిని 7 ఎండ్లలో పూర్తి చేశాం అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం…రైతుల అవహేళన చేసిన ప్రభుత్వాలను చూసాం అన్నారు.

కేసిఆర్ రైతు బంధు గా మారీ రైతన్నలకు వెన్నుదన్నుగా ఉంటున్నారు…దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు, భీమా, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, మిషన్ భగీరథ అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ నే అన్నారు. అంతిమంగా గెలిచేది పనితీరే, మంచి తనమే…కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నాం అన్నారు. ఓట్ల కోసం కాదు.. ప్రజల సంక్షేమం కోసమే పని చేశాం…ప్రతి మనిషి కరోనా టీకా తీసుకోవాలన్నారు. గజ్వేల్ నియోజవర్గంలోని గజ్వేల్ మున్సిపాలిటీ సహా 6 మండలాలు చెందిన 1543 మంది లబ్దిదారులకు ఆహార భద్రత కార్డులు అందజేశారు.అలాగే 452 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.

- Advertisement -