స్థలం ఉండి ఇల్లు కట్టుకునే పేదలకు ఆర్ధిక సాయం: మంత్రి హరీష్ రావు

72
harish
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో గోదావరికి చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చిందన్నారు. ముంపు ప్రాంతాల్లో ఒక్క ప్రాణం పోకుండా కాపాడమని చెప్పారు. భాజాపా పాలిత రాష్ట్రాల్లో ఇక్కడున్నంత అభివృద్ధి లేదని విమర్శించారు. భాజాపా నేతలు హైదరాబాద్‌లో ఉండి బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సంపద పెంచి పేదలకు పంచుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం పేదలను దోచి కార్పొరేట్లకు పంచుతోందని హరీశ్‌ రావు ఆరోపించారు.

సంగారెడ్డి లో 50 కోట్ల స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ తో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం పైలాన్ ను ఆవిష్కరించారు. ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల కళాశాల వసతి గృహం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ను కూడా ప్రారంభించారు మంత్రి హరీశ్‌ రావు. తెలంగాణలో వచ్చే 2 నెలల్లో కొత్త ఫింఛన్లు, రేషన్‌కార్డులు ఇస్తామని హరీశ్‌ రావు తెలిపారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకునే పేదలకు ఆర్ధిక సాయం చేస్తామన్నారు. రూ. 15 కోట్లతో నీళ్ళ ట్యాంకును మరియు 15 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖానను ప్రారంభించారు. సంగారెడ్డి రోడ్లు సరిగా లేవు అని చింతా ప్రభాకర్ సీఎంని కొరగా వెంటనే సీఎం రోడ్ల నిర్మాణం కోసం 50 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని తెలిపారు. అన్ని పనులు చేసుకొని స్వచ్ఛ సంగారెడ్డిగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా అన్నారు. యుద్ద ప్రాతిపదికన రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. 36 కిలో మీటర్ల కొత్త పైప్ లైన్ వేసి, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా మంచి నీరు ప్రతి ఇంటికి అందిస్తామన్నారు. కౌన్సిలర్లు శ్రద్ద తీసుకొని నల్లా కనెక్షన్ ఇప్పించాలని అవసరమైతే ఒక్క రూపాయితో నల్లా కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ చొరవతో సంగారెడ్డిలో 500 కోట్లతో మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో 600 పడకలు ఇక్కడికి అందుబాటులోకి వస్తుందన్నారు. అది త్వరలోనే సీఎం ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. సాధారణ డెలివరీలు ప్రోత్సహించాలన్నారు. సీజేరియన్‌ వల్ల తల్లి, బిడ్డకు నష్టం జరుగుతుందన్నారు. 30 ఏళ్ల వయసు వస్తె చాలు బరువులు మోయలేకపోతున్నారని తెలిపారు. ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ దవాఖానకు రావాలన్నారు. ప్రవ్తేటు ఆసుపత్రులకు పోవద్దని అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకొవద్దని తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నందున్న వాటిని సద్వినియోగం చేసుకొవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -