అప్రమత్తంగా ఉండండి…అధికారులకు హరీశ్ ఆదేశాలు

180
harish rao
- Advertisement -

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలు నీటమునగగా పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హ‌రీశ్‌రావు సూచించారు.

అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన హరీశ్‌… అధికారులు ఎట్టిప‌రిస్థితుల్లో హెడ్ క్వార్టర్స్‌ను వదిలి వెళ్లొద్దని ఆదేశించారు.ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు.

వర్షాలతో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల కుటుంబాలకు.. యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సూచించారు.

- Advertisement -