వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు: హరీశ్‌ రావు

133
harish
- Advertisement -

వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం వస్తుందనే అపోహలు వద్దన్నారు మంత్రి హరీశ్ రావు. 15-18 ఏళ్ల వయస్సు చిన్నారులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు… నాలుగు వారాల తర్వాత 2వ డోస్ టీకా ఇస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1014 ప్రభుత్వ కేంద్రాల్లో పిల్లలకు టీకాలు వేస్తున్నాం అన్నారు. GHMC తోపాటు రాష్ట్రంలోని 12 కార్పొరేషన్ లలో కోవిన్ ద్వారా ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి….. ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్దతిలో టీకాలు వేస్తున్నాం అన్నారు.

నాలుగు రోజుల తరువాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ రేజిస్ట్రేషన్ పై సమీక్షిస్తామన్నారు. తల్లి తండ్రులు లేదా ఉపాధ్యాయుల సమక్షంలోనే టీకాలు అందిస్తామన్నారు. అన్ని కాలేజీల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు , తల్లి దండ్రులు.. పిల్లల వాక్సినేషన్ బాధ్యత తీసుకోవాలన్నారు. కాలేజీలో ప్రతి విద్యార్థి టీకా తీసుకునేలా అధ్యాపకులు బాధ్యత తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం వస్తది అనే అపోహ వద్దు….. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్,కాలేజి ఐడి కార్డ్ లో ఏది ఉన్నా సరిపోతుందన్నారు.

రాష్ట్రం తరపున కేంద్రాన్ని బుస్టర్ డోస్ గురించి చాలా కాలంగా కోరాము. లేఖలు రాశామన్నారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు , ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే పాజిటివిటీ రేట్ నాలుగు రెట్లు పెరిగిందన్నారు. 100% మొదటి డోస్ టీకా పూర్తి చేసిన రాష్ట్రాలను.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖా ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్సు లో అభినందించింది. తొలి డోసు వంద శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు.

- Advertisement -