దశాబ్దాల కల నెరవేరబోతోంది: హరీష్ రావు

144
harish rao
- Advertisement -

సంగారెడ్డి జిల్లా ప‌రిధిలో సంగ‌మేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద 2 ల‌క్ష‌ల 19 వేల ఎక‌రాల‌కు, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద ఒక ల‌క్షా 65 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందిస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు. దశాబ్దాల ప్రజల కల నెరవేరబోతోందన్నారు.

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన హరీష్‌.. సంగ‌మేశ్వ‌ర ప్రాజెక్టు అంచ‌నా వ్యయం రూ. 2,653 కోట్లు, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం రూ. 1,774 కోట్ల‌తో నిర్మిస్తామ‌ని తెలిపారు.

ఒక‌ట్రెండు మాసాల్లోనే టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్తి చేసి ఈ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేస్తామ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. జ‌హీరాబాద్‌, ఆందోల్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని 11 మండ‌లాల‌కు సంగ‌మేశ్వ‌ర లిఫ్ట్ కింద సాగునీరు అందిస్తామ‌న్నారు. మొత్తంగా 231 గ్రామాల‌కు సాగునీరు వ‌స్తుంద‌న్నారు.

- Advertisement -