భట్టికి సీఎం కేసీఆర్ చురకలు…

143
cm kcr
- Advertisement -

కాంగ్రెస్ శాసనసభా పక్షనేత భట్టి విక్రమార్రకు చురకలు అంటించారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సర్పంచ్‌ల విషయం గురించి ఎమ్మెల్యే భట్టి మాట్లాడిన మాటలు సత్యదూరమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్‌లకు స్వేచ్ఛ ఇచ్చి అన్ని హక్కులు కల్పించామన్నారు.

ప‌ల్లె, ప‌ట్ట‌ణ‌ ప్ర‌గ‌తిపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ కాదు.. దీర్ఘ‌కాలిక చ‌ర్చ పెట్టండి అని స్పీక‌ర్‌కు సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. సర్పంచ్‌ల గురించి భట్టి మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తుందన్నారు. ఏక‌గ్రీవ‌మైన గ్రామ‌పంచాయ‌తీల‌కు నిధులు ఇస్తామ‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు. నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టంలో ఆ ప్ర‌స్తావ‌నే లేదన్నారు.

స‌ర్పంచ్‌ల‌కు స‌ర్వ స్వేచ్ఛ ఇచ్చామ‌ని…టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదన్నారు. ప‌న్నులు వ‌సూలు చేసుకునే బాధ్య‌త‌ను పంచాయ‌తీల‌కే అప్ప‌గించామని తెలిపిన సీఎం… గ్రామాల్లో ప‌రిశుభ్ర‌త కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాం అన్నారు. గ్రామాల రూపురేఖ‌ల‌ను మార్చేశామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -