మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవితకు శుభాకాంక్షాలు తెలిపారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ తరపున కవిత నేడు నామినేషన్ వేశారు. ఈమేరకు మంత్రి హరీశ్ రావు ట్వీట్టర్ ద్వారా కవితకు విషెస్ తెలిపారు. నిజామాబాద్ స్ధానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వేసిన కవితకు నా హృదయపూర్వక శుభాకాంక్షాలు అని ట్వీట్ చేశారు.
కాగా నామినేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధిక స్ధానాల్లో టీఆర్ఎస్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉండటంతో కవిత ఎన్నిక లాంఛనం కానుంది. ఈ ఎన్నికల్లో కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
My Heartiest congratulations to @raokavitha on filing nomination as MLC candidate for Nizamabad local bodies constituency
— Harish Rao Thanneeru (@trsharish) March 18, 2020