గ్రామంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలి..

415
- Advertisement -

ఆదివారం సిద్దిపేట జిల్లా ఇర్కోడులో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. సిద్దిపేట మండలం ఇర్కోడ్ గ్రామాన్ని స్వచ్ఛ, ఆరోగ్య గ్రామంగా మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. జాతీయ ఉత్తమ గ్రామపంచాయితీగా రెండవసారి ఇర్కోడ్ గ్రామం ఎంపిక కావడం అభినందనీయమని, ఇది గ్రామస్థులు సమిష్టిగా సాధించిన విజయంగా మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్బంగా గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణకు బుట్టలు పంపిణీ చేశారు. గ్రామంలో మురికి నీరు బయటకు రాకుండా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించి ఉపయోగంలోకి తేవాలన్నారు.

harish rao

మురికి కాలువల్లో మురికి నీరు కనబడకుండా చేయాలన్నారు. గ్రామంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని సూచించారు. గ్రామంలో రెపటి నుండి పేదవారు ఎవరు చనిపోయినా ఉచితంగా అంత్యక్రియలు జరిపించే కార్యక్రమం ప్రారంభిస్తామని హరీష్‌ రావు అన్నారు.ఇందుకోసం జాతీయ అవార్డు కింద వచ్చిన 8 లక్షల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పారు.

harish rao at irkod

అలాగే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ ఏర్పాటు చేయిస్తామని, వారికి సాయంత్రం టిఫిన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు బాగా చదివి పదవ తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని మంత్రి పిలువునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగ, ధ్యానం చేయాలని, ఆరోగ్యానికి యోగా ఒక గొప్ప సాధనంగా మంత్రి పేర్కొన్నారు. ఇందు కోసం ఉచిత యోగా తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -