కాళేశ్వరం నీళ్లతో నర్సాపూర్ రైతుల కాళ్ళు కడుగుతాం: మంత్రి

174
harish
- Advertisement -

శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మార్కెట్ కమిట్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. నర్సపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అనసూయ అశోక్ గౌడ్,వైస్ ఛైర్మన్‌గా హాబీబ్ ఖాన్ ప్రమాణం చేశారు.వీరితో పాటు 10 మంది సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిసున్న రాష్ట్రంలో పింఛన్లు 400 నుండి 500 ఇస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో 2000 పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వాల పాలనలో మంజీర నది మీద ఒక్క చెక్ డ్యామ్ నిర్మించలేదు.. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 110 కోట్లతో 15 చెక్ డ్యామ్ లు నిర్మించాము. అందులో 14 చెక్ డ్యామ్ లు నర్సాపూర్ నియోజకవర్గనికి ఉపయోగపడుతున్నాయి. జార్ఖండ్ మరియు బీహార్ రాష్ట్రలలో మక్కలను 900లకు కొంటున్నరు. అవే మక్కలను నర్సాపూర్‌లో 1100 లకు కొంటున్నారమన్నారు. దేశంలో ఎక్కడలేని విధముగా 24 గంటల కరెంటు సరఫరా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు.

6 వందల కోట్లతో లక్ష కల్లలు కట్టించం.. ఈనెల చివరి వారంలో 7వేల 250 కోట్లతో రైతు బంధు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని విదంగా అభివృద్ధి, సంక్షేమం పథకాలు అమలు చేసి ఆదర్శంగా నిలిచమని మంత్రి తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రలలో లేని విధంగా వరి, మక్కా, కందుల మద్దతు ధర చెల్లిస్తున్నాం.ఇతర రాష్ట్రల రైతులు మక్కా, సన్న ధాన్యం మన వద్దకు వచ్చి అమ్ముతున్నారు. కాళేశ్వరం నీళ్లతో నర్సాపూర్ నియోజకవర్గ రైతుల కాళ్ళు కడుగుతామని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -