మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన..

152
harish

నేడు మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా 6 కోట్ల రూపాయలతో బిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన,మున్నూరు కాపు సంఘ భవనం ప్రారంభోత్సవం, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి హరీష్ రావు తోపాటు ఎమ్మెల్యే లు పద్మాదేవందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా లక్ష రూపాయలు సహాయం చేస్తా లేదు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు ఇస్తానంటే బిజెపి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లు వద్ద కరెంటు మీటరు ఏర్పాటు చేస్తామని అంటున్నారు. రామలింగారెడ్డి చేతిలో ఓడిపోయిన నాయకులంతా నేడు కొత్తబట్టలు వేసుకొని దుబ్బాక నియోజక వర్గంలో తిరుగుతున్నారని మంత్రి ఎద్దేవ చేశారు. అన్ని రకాల అభివృద్ధి చేసే తెలంగాణ పార్టీకి ఓటు వేసి గెలిపించు కోవాలి. టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలే గెలిపిస్తాయని హరీష్‌ అన్నారు.