మీ ఆరోగ్య రక్షణే మా ధ్యేయం- మంత్రి హరీశ్‌

227
harish
- Advertisement -

శనివారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో రుతు ప్రేమ ప్రారంభ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌ రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణంతో పాటు స్వచ్ఛ సిద్ధిపేట జిల్లాకు పాటు పడదామని దిశానిర్దేశం చేశారు. మీ నిశ్శబ్దం వీడండి. బహిరంగంగా చర్చించండి.. రుతుప్రేమ ప్రయోజనాలు వివరించండి. రుతుప్రేమ లేకపోతే.. జీవనమే లేదు అన్నారు. మానవ మనుగడను శాసించేది రుతుచక్రం. మీ ఆరోగ్యం కాపాడాలి. మీ డబ్బు కాపాడాలి. మీ ఆరోగ్యమే.. మా ఆరోగ్యం. మీకు ఆరోగ్య వంతమైన, సౌకర్యవంతమైన, శాస్త్రీయమైన రుతుచక్రంపై మీకు అవగాహన కల్పించేందుకు ఈ రుతుప్రేమ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలపారు.

సిద్ధిపేట జిల్లాలో ఇప్పటికే 3 వేల మందికి రుతుప్రేమ మెన్స్ట్రు వల్ కప్పులు అందజేశాము. జిల్లాలోని మహిళా పంచాయతీ కార్యదర్శిలు, ఆశాకార్యకర్తలు, ఏఎన్ఏంలు అలాగే మహిళా గ్రామ సర్పంచ్‌లు, ఏంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లుగా.. మీరంతా టీమ్ లీడర్లు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. మీరు పట్టుబడితే.. కానిదేమీ లేదు సూచించారు. రుతుప్రేమ విజయవంతం చేసేందుకు మీరంతా నడుం బిగించాలని పిలుపునిచ్చారు మంత్రి హరీశ్‌. మొదట మీరు ఉపయోగిస్తే.. మీరే మోటీవేటర్లుగా.. అందరిలో స్ఫూర్తిని నింపిన వారవుతారు. త్వరలోనే అన్నీ కస్తూర్భా, రెసిడెన్షియల్ పాఠశాలలలోని మహిళా విద్యార్థినీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు పాటు పడటంతో పాటుగా మీ ఆరోగ్య రక్షణ చేయాలన్నదే మా ధ్యేయం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా, అలాగే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే రాష్ట్రం, దేశం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి హరీశ్‌ అన్నారు.

- Advertisement -