తెలంగాణ వైతాళికుడు సురవరం- సీఎం కేసీఆర్‌

91
kcr cm
- Advertisement -

సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్మరించుకున్నారు. రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారునిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సామాజిక సేవ చేసిన తెలంగాణ వైతాళికుడు సురవరం అని సీఎం కొనియాడారు. తెలంగాణపై వివక్షను నాడే ఎదిరించి గోల్గొండ పత్రిక ద్వారా తెలంగాణ సాహితీ ఆత్మగౌరవాన్ని చాటిన సురవరం, తెలంగాణ గడ్డ గర్వించదగ్గ బిడ్డ అని సీఎం కొనియాడారు.

తెలంగాణ సాధనాపోరాటంలో సురవరం స్ఫూర్తి ఇమిడి వుందని సీఎం అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. సురవరం సేవలకు గుర్తుగా ఆయన పేరుతో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు గౌరవ పురస్కారాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నామని సీఎం తెలిపారు.

- Advertisement -