- Advertisement -
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పర్యటించారు మంత్రి హరీష్ రావు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేస్తున్న 216 మంది ఆశ వర్కర్లకు దత్త డయాగ్నోస్టిక్స్ వారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విపత్కర పరిస్థితుల నడుమ ఆశ వర్కర్లు చేస్తున్న కృషి వెల కట్టలేనిదని పేర్కొన్నారు. ప్రభుత్వం వారి కష్టాన్ని గుర్తిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సమాజానికి వీరు చేస్తున్న సేవలను గుర్తించి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన డా. సుజాత సాయినాథ్ గారిని అభినందిస్తూ, కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఇంకా దాతలు ముందుకు రావాలని ఈ మేరకు పిలుపునిచ్చారు.
- Advertisement -