ఈటలపై మంత్రి హరీష్‌ తీవ్ర విమర్శలు..

17
harish

సోమవారం మంత్రి హరీష్‌ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు.ఈ సందర్భంగా కమలాపూర్‌లో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైకును నడుపుతూ అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం కమలాపూర్ మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈటల మొసలి కన్నీరు కరుస్తున్నారు.. టీఆర్ఎస్ పార్టీ ఈటలకు ఎంతో గౌరవం ఇచ్చిందని, ఒక్క సీఎం పదవి తప్ప అన్ని పదవులు కల్పించిందని వెల్లడించారు. కానీ, ఈటల వ్యవహారం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉందని మంత్రి హారీష్‌ రావు విమర్శించారు. ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల బొట్టుబిళ్లలు, కుట్టు మిషన్లు ఎందుకు పంచుతున్నారని ప్రశ్నించారు. తమది పనిచేసే ప్రభుత్వం అని, బీజేపీ నేతలవి వట్టి మాటలేనని అన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని హరీష్‌ విమర్శించారు.