సిద్ధిపేట జిల్లా స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభంపై విపంచి ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..కరోనా వల్ల జన జీవనం స్తంభించిపోయింది. లాక్ డౌన్ తో విద్యాసంస్థలన్నీ మూసివేయాల్సి వచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తొమ్మిది నుండి ఆపై తరగతిలు, కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయన్నారు. పది నెలల తర్వాత పాఠశాలలు, కళాశాలలు ప్రారంభిస్తున్నాం. తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి. పాఠశాలల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, టాయిలెట్లు మంచిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్య నిర్వహణకు ఉపాదిహామీ కూలీలను, పంచాయతీ సిబ్బందిని వినియోగించుకోవాలని మంత్రి ఆదేశించారు.
పాఠశాలల్లో మరుగుదొడ్ల శుబ్రపరిచేలా క్షేత్ర పారిశుధ్య కార్మికులకు ఎంపిడివో ద్వారా ఆదేశాలు ఇప్పిస్తాం. ప్రతీ పాఠశాలకు రోజూ వారీగా పారిశుద్ధ్యం కార్యక్రమాలు చూసేలా ఒక పారిశుద్ధ్య కార్మికుడికి బాధ్యతలు ఇస్తాం. తాగు నీటి సౌకర్యం, టాయిలెట్లు వంటి మరమ్మత్తులకు పంచాయతి నిధులు వాడండి. మధ్యాహ్న భోజనం కోసం సన్న బియ్యం, ఇతర పదార్థాలు పాడయిపోయినవి వాడవద్దని మంత్రి సూచించారు. ప్రస్తుతం పాఠశాలల్లో నిల్వ ఉన్న నిత్యావసర సరుకుల తీసుకుని కొత్తగా సరుకులను అందజేస్తాం. గురుకులాల్లో పాత కాంట్రాక్ట్ ల ద్వారానే నిత్యావసర సరుకులను సరఫరా చేయాలి.పాఠశాలలు పున: ప్రారంభంకు ముందే విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశం ఏర్పాటు చేయాలి అని మంత్రి తెలిపారు.
పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రుల్లో ధైర్యాన్ని నింపాలి.మూడు రోజుల ముందే అన్ని పాఠశాలలకు సన్న బియ్యం అందేలా జిల్లా అధికారులు చూడాలి. పిల్లల సిలబస్ ను విద్యాశాఖ అధికారులు, టీచర్లు ప్లాన్ చేసుకోవాలి. జిల్లాలోనీ అన్ని ప్రభుత్వ పాటశాల లో 9,10తరగతి విద్య నభ్య సిస్తున్న 24,493 మంది విద్యార్థులకు 50 వేల మాస్క్ లను ప్రభుత్వం పరంగా ఉచితంగా అందజేస్తామన్నారు. టీచర్ లకు కొవిద్ టీకా వేసే అంశంను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. విద్యా సంస్థలు మూతబడే ముందు విద్యార్థుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్‌టీసీ బస్సులు ఎలా నడిచేవో ఫిబ్రవరి 1 నుంచి అలానే నడిచేలా చూస్తామని మంత్రి హరీష్ స్పష్టం చేశారు.