గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన మోడల్ స్కూల్ విద్యార్థులు..

42
Green Challenge

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు “మేమున్నాం మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో” ఈరోజు నేలకొండపల్లి మండలం,గ్రామం లోని మోడల్ స్కూల్ విద్యార్థులతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం మొక్కలు నాటడం మాకు ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థినులు చెప్పడం జరిగింది. రాజ్యసభ సభ్యుడు టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మేము కూడా మొక్కలు నాటడం మాకు ఎంతో సంతోషంగా ఉందని సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేయడం జరిగింది.

అదే విధంగా రాష్ట్రంలోని యువత ముందుకు వచ్చి అందరూ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితహారం మన అందరి బాధ్యత చాలెంజ్ గా తీసుకోవాలి అని నేటి యువతకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ శోభన్ కొన్ని మొక్కలను పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ చింత మల్ల శోభన్, సభ్యులు అర్చన ,సుగుణమ్మ ,రాజా మేఘన ,జయరాజు రత్నకుమారి పాల్గొనడం జరిగింది.