శుక్రవారం మంత్రి హరీష్ రావు విపంచి కళా నిలయంలో సిద్దిపేటలో కాలకుంట కాలనీలోని 180 మంది లబ్ధిదారులకు నివాస స్థలల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అర్హులకు పట్టాల అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 30 ఏండ్ల క్రితం కాలకుంట కాలనీ లే అవుట్‌లో ప్రభుత్వం 1558 మంది పేదలకు పట్టాలిచ్చాం. నిజమైన అర్హులకు యాజమాన్య హక్కులు, పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నామన్నారు. తొలి దశలో కాలకుంట కాలనీలోని 180 మంది లబ్ధిదారులకు నివాస స్థల పట్టాల పంపిణీ చేస్తున్నాం. పట్టాతో పాటు ఆన్‌లైన్‌లో పేరు మార్పిడి, నల్లా కనెక్షన్ పత్రాలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు.
కాలకుంట కాలనీ ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుకుందాం. పట్టాల కోసం ఎవ్వరికీ ఒక్క పైసా లంచం ఇవ్వొద్దు. లంచం ఇచ్చినా, తీసుకున్న బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. కాలకుంట కాలనీ లోని చింతల చెరువు క్యాచ్ మెంట్ ఏరియా పరిధిలోని ఇండ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేశాం. కాలకుంట కాలనీలోని నర్సాపూర్ చెరువు క్యాచ్ మెంట్ ఏరియా పరిధిలోని ఇండ్లకు సాధ్యమైనంత త్వరగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసిన వెంటనే అన్ని గల్లీలలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని.. కాలనీ ప్రజలు తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలన్నారు. సిద్దిపేటను శుద్ది పేటగా మార్చేందుకు కాలకుంట కాలనీ ప్రజలు సహకారం అందించాలి.