సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష ఫలించింది- మంత్రి హరీష్‌

286
harish
- Advertisement -

సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష ఫలించింది. దశాబ్దాల కల సాకారం అయింది. కాళేశ్వరం గోదారమ్మ తరలి వచ్చి రంగనాయకుని సన్నిధికి చేరింది. గోదావరి జలాలతో పురిటి గడ్డ పుణీతమైందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. రేపు రంగనాయక సాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా రైతుల, ప్రజల సాగునీటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తి ” సూర్య చంద్రులు ” ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి మెదక్ జిల్లా, సిద్దిపేట ప్రాంతం రైతుల ఆత్మహత్యలకు చిరునామా గా మారింది. సమైక్య రాష్ట్రంలో సిద్దిపేట ప్రాంత రైతులు సాగునీరు గురించి అప్పటి పాలకులు ఏమాత్రం పట్టించుకోలే కనీసం ఆలోచించలేరు అని మంత్రి అన్నారు.

సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు బలయ్యారు. లెక్క లేనంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరెంర్ కష్టాలతో తల్లడిల్లారు. పంటలకు సాగునీరు లేక రైతులు బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి..ఎన్ని బోర్లు వేసిన నిరందక అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు..దుబ్బాక ప్రాంతంలో ఎన్నో ఆకలి చావులు జరిగాయి. భూమిని నమ్ముకొని జీవించే రైతులకు పురుగు మందు పెరుగన్నం అయింది. కానీ నాడు 60ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది.. నేడు దశాబ్దాల కల సాకారమైంది. రంగనాయక సాగర్ ప్రాజెక్టుతో ఈ ప్రాంత రైతుల జీవితాల్లో గొప్ప వెలుగువస్తుంది. అభివృద్ధి బహుముఖంగా ఉంటుందని మంత్రి హరీష్‌ హర్షం వ్యక్తం చేశారు.

మరో వైపు ప్రాజెక్టుల నిర్మాణంలో ముంఫుకు గురైన రైతుల కుటుంబాలకు ఇంటికి పూర్తి స్థాయిలో నష్ట పరిహారం చెలించారు. వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద యుద్ధప్రాతిపదికన ఇండ్లను నిర్మించి ఇవ్వడం కూడా జరిగాయి. భూములు త్యాగం చేసిన రైతులకు ప్రాజెక్టు సేకరణ చరిత్రలో ఒక్క కేసు లేకుండా ఎన్నడూ లేని విధంగా భూములిచ్చిన తక్షణమే నష్ట పరిహారం చెక్కులను అందజేశారు. కుటుంబంలో పెళ్లైన యువతి యువకులకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వడం జరిగింది. నిర్మించిన ప్రాజెక్టుల్లో చేపలు పట్టుకొనే హక్కును ఆయా గ్రామాల రైతులకు అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా భూములిచ్చి త్యాగాలు చేసిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న… వారి త్యాగాలు మరువలేనివి.త్యాగాలు చేసిన రైతుల పేర్లు సువర్ణాక్షరాలతో లికించబడి ఉంటుంది. రంగనాయక సాగర్ ప్రాజెక్టు తో సిద్దిపేట నియోజకవర్గంలో 71వేల 516 ఎకరాల కు సాగునీరు అందుతుంది. నియోజకవర్గంలో చెరువులను, కుంటలను పూర్తి స్థాయిలో నింపుతాం.ఇక రైతులు వాన కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు.. కరెంటు కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండదు. బోరు వేస్తే నీళ్లు పడతాయ లేదా అని ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.మూడు కాలాలు పంటలు పండించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు.

కాలువల ద్వారా వచ్చే నీటితో రైతుల భూముల్లో పసిడి పంటలు పండుతాయి.దిగుబడి పెరుగుతుంది.ఈ ప్రాంతం బహుముఖంగా అభివృద్ధి చెందుతుంది. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.రైతులకు ఒక వైపు నుండి ప్రభుత్వ పెట్టుబడి సాయం , ఉచిత కరెంట్ ,సాగునీరు ప్రధాన మైనవి ప్రభుత్వం నుండి సమకురడం వల్ల ఇక రైతులు అప్పుల చేయాల్సిన పరిస్థితి ఎంత మాత్రమ్ ఉండదు.. రైతుల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు..ఈ ప్రాజెక్టు వల్ల చేపల పెంపకం పెరిగి మత్స్యకారుల జీవుతాల్లో వెలుగులు నిండుతాయి. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతాయ్. నీళ్లు వచ్చిన చోటికి పరిశ్రమలు వస్తాయి. పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది.చదువుకున్న యువకులకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు దక్కుతాయి.సిద్దిపేట ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా సాంస్కృతికంగా అభివృద్ధి చెందుతుంది.

నీటితో అనేక రంగాలు అభివృద్ధి చెందుతాయి.ప్రజలకు స్వచ్ఛ మైన త్రాగునీరు లభిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మాదిరిగానే ఈ జల సాధన ఉద్యమం విజయవంతం అయింది. ఈ మహా జల కృతువులో భాగస్వామీ అయినందుకు ” నా జన్మ చరితార్థం ” అయింది. ఈరోజు కోసం మనం ఎన్నో శతాబ్దాల నుండి ఎదురుచూస్తున్నం. మన కష్టాలు , మన రైతుల కష్టాలు ఎప్పుడు తీరుతాయా. మన బీడు భూముల్లో గోదావరి జలాల గళ గళలు ఎప్పుడు వినిపిస్తాయా.. మన ప్రాంత కరువు శాశ్వతంగా ఎప్పుడు పరిష్కారమవుతుందా.. అని ఇన్నేళ్ల నుండి వెయ్యి కళ్లు చేసుకొని ఎదురు చూసినం.

ఈ మహా జల యజ్ఞములో భాగస్వామ్యం అయ్యే మహా భాగ్యం నాకు దక్కినందుకు నేను పొందుతున్న ఆనందానికి అవధుల్లేవు. ఒక ప్రజాప్రతినిదిగా ఇంతకంటే పొందే సంతృప్తి మరింకెమి ఉండదని , నా జన్మధన్యమైందని భావిస్తున్నాను. రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణము పునాది రాయి వేసినప్పటి నుండి ఆ నిర్మాణం పూర్తయి గోదావరి జలాలు బీడు భూముల్లోకి తరలి వచ్చే సందర్భం వరకు అందులో భాగస్వామి అయినందుకు నా జన్మ సార్డకమైందని భావిస్తున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారమై మనందరి కృషి ఫలించి ” ఒక్క ఇల్లు కూడా ముంపుకు గురికాకుండా 3 టీఎంసీల నీటి సామర్థ్యంతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించుకవడం ఒక అరుదైన ఘట్టం. ఇది సీఎం కేసీఆర్ , తెలంగాణ ప్రభుత్వ పనితీరు కు ఒక గొప్ప నిదర్శనం ” అని మంత్రి హరీష్ రావు తెలిపారు.

- Advertisement -