మంత్రి హరీష్ రావు అంటేనే జోష్. తను ఎక్కడున్నా… ఏ శాఖలో ఉన్న పని పరుగులు పెట్టాల్సిందే. రాత్రి, పగలు అని తేడా లేకుండా తాను పనిచేస్తూ… చేయించటం హరీష్ రావు స్టైల్. అందుకే హరీష్ రావు ఓ శాఖను టేకప్ చేశాడంటే చాలు… అధికారులంతా హడలెత్తిపోవాల్సిందే. ముఖ్యంగా జనం ఇబ్బందిపడుతున్నారంటే హరీష్ రావు ఊరుకోడు అన్నది ఓపెన్ సీక్రెట్. మంత్రి హరీష్ రావు… వైద్యారోగ్య శాఖ తీసుకున్న తర్వాత పరిస్థితుల్లో వేగంగా మార్పులు కనపడుతున్నాయి. హైదరాబాద్ చుట్టూ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కోసం ప్రభుత్వం ఎప్పుడో రెడీ అయ్యింది. కానీ స్థల సమస్యతో ఆగింది. కానీ హరీష్ రావు వచ్చి ఆ ఫైలు దుమ్ము దులిపారు. ఎక్కడ ఇబ్బంది ఉందో మాట్లాడారు. సర్ధి చెప్పారు. ఫలితంగా పనులు మొదలయ్యే వరకు వచ్చింది.
ఇదోక్కటే కాదు జిల్లా జిల్లా తిరుగుతున్నారు. జిల్లాల్లో సర్కారు ఆసుపత్రులంటే జనం పెద్దగా పట్టించుకోరు. కారణం అక్కడ సౌకర్యాలు, డాక్టర్లు ఉండరు అన్న అభిప్రాయం ఉంది. కానీ, దాన్ని మార్చే పనిలో హరీష్ విజయవంతంగా సాగుతున్నారు. సాయంత్రం 5గంటల వరకు డాక్టర్లు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాల్సిందేనని డెడ్ లైన్ పెట్టారు. మందులు, శానిటేషన్ టైంకు జరిగేలా చర్యలు చేపడుతున్నారు. ప్రతి రోజు అధికారులంతా వాట్సప్ గ్రూపుల ద్వారా పనులు ఎంత వరకు వచ్చాయి, తన ఆర్డర్స్ అమలవుతున్నాయో లేదో అప్డేట్ చేయాల్సిందే. అంతేకాదు పేపర్ లో ఏ చిన్న వార్త వచ్చినా సరే… సంబంధిత ఆసుపత్రి వర్గాలతో హరీష్ రావు నేరుగా మాట్లాడుతున్నారు.
సమస్య పరిష్కరించటమే కాదు అధికారులు అలసత్వం వహిస్తే తన స్టైల్ లో హెచ్చరికలు కూడా జారి చేస్తున్నారు. ప్రజలకు నిత్యం సేవ చేసే వైద్యారోగ్య శాఖకు ఉన్న అవినీతి మకిలీ చెరిపేసే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని సవాల్ గా తీసుకొని… వచ్చే విద్యా సంవత్సరం వరకు ఎక్కువ సీట్లు పిల్లలకు దక్కేలా మిషన్ మోడ్ లో పనిచేస్తూ అందరి నోటా ఔరా అనిపించుకుంటున్నారు. మంత్రి హరీష్ రావు దూకుడు చూసి… ప్రతిపక్షాలు సైతం కనీసం వేలెత్తి చూపే పరిస్థితి లేకపోవటం హరీష్ అండ్ టీంను శభాష్ అనేలా చేస్తుంది.