ప్రైవేట్ పాఠశాల కంటే దీటుగా చదువుకోవాలి..

516
harish rao
- Advertisement -

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శ్రీ సత్య సాయి అన్నపూర్ణా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహార సేవా కార్యక్రమాన్ని మరియు విద్యార్థులకు రక్తహీనత పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు, కలెక్టర్ వెంకట్ రాంరెడ్డిలు హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ మధ్య అమ్మాయిలపై అఘాయిత్యాలు జర్గుతున్నాయి. ఆడపిల్లలు తమను తాము రక్షించుకునే విధంగా నెలలో ఒక్కసారి తల్లిదండ్రులు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా.. మనం మారాల్సింది, మర్చల్సింది మగపిల్లలను మాత్రమే. విద్య తో పాటు మగ పిల్లలకు విలువ, సంస్కారం లతో కూడిన విద్య నేర్పించాలి. దేశంలో రాష్ట్రంలో ఆడపిల్లలకు తల్లిదండ్రులు బుద్ది ఎలా నేర్పుతున్నారు, అలాగే మగ పిల్లల బాధ్యతను గుర్తించాలి. దిశ సంఘటన తరవాత అందరం బాధపడ్డం ఇలాంటి సంఘటనలపై సమాజం, తల్లిదండ్రులు సామాజిక శృహ ఉండేలా ఆలోచించాలి అన్నారు మంత్రి హరీష్‌.

ప్రభుత్వ బాలికల స్కూల్ అభివృద్ధికి 25 లక్షలు మంజూరు.. మరో 50 లక్షలు వచ్చే ఏడాది మంజూరు చేస్తా, ఎన్ని పదికి పది సాధిస్తే అన్ని లక్షలు ఇస్తా.. ఈ మూడు నెలలు దించిన తల ఎత్తకుండా చదవాలి. జిల్లాలో ఈ స్కూల్ నెం 1 ఉండాలి, రాష్ట్రంలో సిద్దిపేట నేం 1 ఉండాలి. జిల్లాలోని 413 పాఠశాలలో 68 వేల విద్యార్థులకు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టీ 11 మిషన్లతో ఆరవ తరగతి నుండి 12 తరగతి విద్యార్థులకు రక్త హీనత పరీక్షలు నిర్వహిస్తున్నాం. రక్తహీనత పది శాతం కంటే తక్కువ ఉన్నవారిని గుర్తించి వారికి మందులు అందిస్తామని మంత్రి తెలిపారు.

ప్రతి ఒక్కరూ తినే ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకోవాలి. కూరగాయలు, బెల్లం, పల్లీలు,మునగకాయలు వంటి ఆహార పదార్థాలను తినాలి. ఆరోగ్యం బాగాలేకపోతే బాగా చదవలేము. రక్త హీనత పరీక్ష చేయడం గొప్ప కాదు.. వారి తల్లదండ్రులకు జాగ్రత్తలు చెప్పినప్పుడు దానికి సార్థకత చేకూరుతుంది. నాకు ఈ పాఠశాల విద్యార్థులు అందరూ పదికి పది సదించలాని నా కోరిక. గతేడాది 43 పాఠశాలలో పదికి పది సాధించారు. పదికి పది సాధించిన అందరికీ 25 వేలు విద్యార్థులకు,ఉపాధ్యాయులకు ఇస్తామని హరీష్‌ రావు అన్నారు.

ప్రతి ఒక్కరూ యోగ నేర్చుకొని వారి తల్లదండ్రులకు కూడా నేర్పించాలి. యోగా వల్ల పిజీకల్ పిట్నేస్ కాకుండా మెంటల్‌గా కూడా పిట్‌గా ఉంటారు. మంచి మార్కులు, ర్యాంకులు రావాలంటే వత్తిడి పోవాలంటే యోగా చేయాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యోగా నేర్చుకోవాలి. నేటి నుంచి ఈ పాఠశాలలో అల్పాహారం, ట్యూషన్ నేర్పిస్తాం. ప్రైవేట్ పాఠశాల కంటే దీటుగా చదువుకోవాలి. ఈ పాఠశాల విద్యార్థులు వందశాతం పలితాలు సాధించాలని మంత్రి హరీష్‌రావు విద్యార్థులకు సూచించారు.

Minister Harish Rao Launched Health Camp In Siddipet

- Advertisement -