- Advertisement -
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ను, క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించారు. క్యాథ్ ల్యాబ్‌ను రూ. 8 కోట్లతో ఏర్పాటు చేశారు. అగ్నిమాపక యంత్రం, ఆక్సిజన్ ప్లాంట్‌ను కూడా ప్రారంభించారు. ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. ఇటీవలే గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిలోఫర్ హాస్పిటల్‌లో రూ. 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, నియోనాటల్ స్కిల్ ల్యాబ్‌ను మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉస్మానియా ఆసుపత్రి డిఎంఇ రమేష్ రెడ్డి లు పాల్గొన్నారు.
- Advertisement -