జూబ్లీహిల్స్‌లో పర్యటించిన ఎమ్మెల్యే దానం..

29

మంగళవారం ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ డివిజన్‌లో జిహెచ్ఎంసి, విద్యుత్ శాఖ, జల మండలి అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పర్యటించారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే దానం అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 1 కోటి రూపాయల వ్యయంతో మంచి నీరు, సివారేజ్ పనులను ప్రారంభిస్తున్నామని, అదేవిదంగా 1 కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో రోడ్ వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.