- Advertisement -
సిద్దిపేట కోమటి చెరువు అభివృద్ది సియం కేసీఆర్ కళ అన్నారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట కోమటి చెరువు పై నూతనంగా నిర్మించిన సస్పెన్షన్ బ్రీడ్జి ని మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ లు ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కోమటి చెరువు 1997 నుండి నేటి వరకు ఇంత అభివృద్ది జరిగింది. లక్నవరం తర్వాత సిద్దిపేటలో ఇంత పెద్ద సస్పెన్షన్ బ్రీడ్జి ఏర్పాటు చేసుకున్నాము.
చెరువును సుందరంగా తీర్చి దిద్దాము. ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణ ను నాటి పాలకులు పట్టించుకోలేదు. ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు వారికి మిగిలిన ఆహారాన్ని పాత బస్టాండ్ వద్ద పెట్టిన ప్రిజ్ లో పెట్టండి. అన్నదానం కంటే మించిన గొప్ప దానం లేదన్నారు. కోమటి చెరువు సిద్దిపేట ప్రజల ఆస్థి అందరూ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
- Advertisement -