మొక్కలు నాటిన కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్

370
Collector

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి అద్బుతమైన స్పందన వస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చాలా చురుకుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించారు కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్.

తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మరొక ముగ్గురికి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.1) కృష్ణ భాస్కర్ కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా 2) డాక్టర్ శరత్ కలెక్టర్ జగిత్యాల జిల్లా 3) ప్రశాంత్ పాటిల్ కలెక్టర్ వరంగల్ అర్బన్ జిల్లాలకు మొక్కలు నాటాలని కొరారు.

ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొక్కలను నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ఈ సందర్భంగా సంతోష్ కు కృతజ్ఞతలు తెలిపారు.