ఆంధ్ర బ్యాంక్ కు సహాకారం అందిస్తాంఃమంత్రి హరీష్‌ రావు

326
harish rao
- Advertisement -

ఆంధ్ర బ్యాంక్ కు తెలంగాణ ప్రభుత్వం తరపున సహాకారం అందిస్తామని చెప్పారు ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. బి ఆర్ కె భవన్ లో ఆంధ్రా బ్యాంక్ సెక్రెటరీయేట్ బ్రాంచ్ ని ప్రారంభించార మంత్రి హరీష్ రావు . ఈసందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఈరోజు బిఆర్కే భవన్ లో తిరిగి సచివాలయం శాఖ ను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర బ్యాంక్ తెలుగు ప్రజలకు చాలా దగ్గరి బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్.

ఎక్కువ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్రబ్యాంక్ తొలగిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఈ బ్యాంక్ కొనసాగలని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొనసాగాలని కోరుకుంటున్నాడు. ఎక్కువ మంది మహిళలకు గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాఖలు ఏర్పాటు చెయ్యలని కోరుతున్నాం. ప్రజలు, రైతులకు మరింత సేవ చేయాలి అని బ్యాంక్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -