మీ ప్రేమే అసలైన వైద్యం: హరీష్ రావు

303
harishrao
- Advertisement -

ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు కరోనా సోకింది. వైరస్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షచేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని మంత్రి స్వయంగా శనివారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. దీంతో పాటు నాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

మీ ప్రేమే నాకు అసలైన వైద్యం..దయచేసి నాకు ఫోన్ చేయడానికి,నన్ను కలుసుకోవడానికి ప్రయత్నించకండి…నా హెల్త్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా మీతో షేర్ చేసుకుంటానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నారు. వైద్యుల సూచనలను పాటిస్తున్నారు.

- Advertisement -