రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇచ్చి ఇక్కడకు రండి..

239
harish
- Advertisement -

పఠాన్ చెరువులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ నాయకులు ప్రచారానికి వస్తున్నారు. ఢిల్లీ నుండి వచ్చే కేంద్ర మంత్రులకు నేను ఒకటే చెపుతున్నా..రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇచ్చి ఇక్కడకు రండి అని మంత్రి తెలిపారు. ఛార్జ్ షీట్ అసలు వేయాల్సి వస్తే బీజేపీ పై వెయ్యాలి. ఆంధ్రలో 7 మండలాలను, లోయర్ సీలేరు ప్రాజెక్ట్ ను అప్పనంగా ఆంధ్రాకు కట్టబెట్టిన పార్టీ బీజేపీ పార్టీ. ఐజిఎస్టీ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఉన్నది బీజేపీ పార్టీ..బిఆర్జిఎఫ్ నిధులు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపుతున్న పార్టీ బీజేపీ అని మంత్రి విమర్శించారు.

.డిసెంబర్ 1 నాడు మీ ఛార్జ్ షీట్ కు హైదరాబాద్ నగర ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. బెంగుళూరు, గుజరాత్ లలో వరదలు వస్తే డబ్బులు ఇచ్చిన బీజేపీ హైదరాబాద్ కు వరద సహాయం ఎందుకు చేయలేదు? ..హైదరాబాద్ ప్రజల అవస్థలు మీకు పట్టదా అని ప్రశ్నిస్తున్న? అన్నారు. మీకు హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఓటేయాలి.. ఐటీఐఆర్ ను హైదరాబాద్ కు రాకుండా చేసినందుకు. మీకు ఓటేయాలా, 7 మండలాలను ఆంధ్రాలో కలిపినందుకు ఓటేయాలా? ఒక్క రూపాయి వరద సహాయం చేయనందుకు ఓటేయాలా? అని ప్రశ్నించారు మంత్రి.

తెలంగాణకు కేంద్రం నుండి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు తెచ్చిన తర్వాతే హైదరాబాద్ ప్రజలను ఓట్లు అడగాలి. హైదరాబాద్ ప్రజలపై బీజేపీకి ప్రేమ ఉంటే ప్రజలకు వరద సహాయానికి నిధులు విడుదల చేయండి. హైదరాబాద్‌లో వరదలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కారణమంటున్న కేంద్ర మంత్రి జవదేకర్ ముంబై వరదలకు కారణమేవరో చెప్పాలి. మొన్నటి వరకు బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ముంబై వరదలకు కారణం ఎవరో చెప్పాలి. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ మొన్నటికి మొన్న కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం భేష్ అని మెచ్చుకుంటే ఈరోజు హైదరాబాద్ వచ్చిన మరో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కరోనాను కట్టడి చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నారు.

హైదరాబాద్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓట్ల కోసం టీఆర్‌స్‌పై విమర్శలు చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్న.. బీజేపీ నేతలు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న గుజరాత్‌లో కేంద్ర ప్రభుత్వం పథకం ఫసల్ భీమా యోజనా పథకం ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలి. బీజేపీ ఆఫీస్‌లో కుర్చీలు ఎగురుతున్నాయి, షర్ట్ లు చిరుగుతున్నాయి. మీ మధ్య మీకె సమన్వయం లేదు. ఇక ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని మంత్రి హరీష్‌ ఎద్దేవ చేశారు.

- Advertisement -