మొక్కలు నాటిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్..

47
Mla Dasyam Vinay Bhaskar

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర మొక్కలు నాటారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ , ప్రముఖ కాంట్రాక్టర్ వేముల సత్యమూర్తి ,GWMC 39వ డివిజన్ కార్పోరేటర్ శ్రీనివాస్ లను గ్రీన్ చాలెంజ్ కి నామినేట్ చేశారు.